టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది.ఈ మధ్య ఐసీసీ ట్వీట్లలో పెట్టే పోస్టులలో ధోనీనే తరచూ కనిపిస్తున్నాడు.మొన్న ధోనీ కీపింగ్ చేస్తే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించింది ఐసీసీ..ధోనికి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ ధోనినే. దీనికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ఓ మెరుపు స్టంపింగ్‌తో మరోసారి తానేంటో నిరూపించాడు.ఓ అభిమాని వచ్చి తన కాళ్లపై పడితే..ముందు అతడి చేతిలోని జాతీయ పతాకం నేలపై పడకుండా పట్టుకున్నాడు. మ్యాచ్ తర్వాత తాజాగా ఐసీసీ మరో ట్వీట్ చేయడంతో అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు.అంపైర్ లేని క్రికెట్‌ను ఊహించండి..అన్ని మ్యాచ్‌లు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి అంటూ ట్వీట్లు చేస్తూ వెళ్లింది.అలానే ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది..అంటూ ట్విట్ చేసింది.