సుడిగాలి సుధీర్ …ఇతని పేరు చెప్తే వెంటనే గుర్తుకొచ్చేది జబర్దస్త్.కామెడీ స్కిట్స్ చేస్తు ఒక వెలుగు వెలిగిన వ్యక్తిలో సుధీర్ ముందు వరుసలో ఉంటాడు.బుల్లితెరలో కూడా హీరోలు ఉంటారని నిరూపించాడు.సుధీర్‌కు అమ్మాయిలలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.రెండు మెగా షోలకు యాంకరింగ్ చేస్తాడు కూడా.ఈ రెండు షోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.ఇది సుధీర్ పర్సనల్ లైఫ్ మరియు వృత్తి.కాని సుడిగాలి సుధీర్ అంటే మరో కోణం కూడా ఉంది.ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదోక వార్తలో కనిపిస్తాడు.అయితే సుధీర్ ,రష్మిల ఎఫైర్ గురించి కొన్నిరోజులుగా రకారకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరికీ పెళ్లి అని కూడా మొన్నటి వరకు అనుకున్నారు కాని ఇవ్వన్ని తప్పుడు వార్తలు అని ఆ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.
అయితే తాజాగా సుధీర్ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు.ఇప్పుడు మీరు వింటున్నది నిజమే. కాకపోతే నిజమైన పెళ్లి కాదు.ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే పోవే పోరా షోలో ఒక సన్నివేశం.ఇందులో పెళ్లి కొడుకుగా సుధీర్,పెళ్లికూతురుగా యాంకర్ విష్ణు ప్రియ దర్శనం ఇస్తారు.వీరిద్దరికీ పెళ్లి జరుతునట్లు ఒక ప్రోమోను యూట్యూబ్‌లో విడుదల చేశారు.ప్రోమోను చూసినవారు అందరు జంట చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.