ఏపీలోని గుంటూరులో జరుగుతున్న సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. తన కంటే సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులతో చేతల్లో చేసిందేమీ లేదని అన్నారు. ‘నాకంటే సీనియర్‌ని అని చంద్రబాబు పదేపదే అంటున్నారు . ఆ మాట నిజమే..!! చంద్రబాబు గారు నాకంటే సీనియరే.. పార్టీ ఫిరాయింపుల్లో మీరే సీనియర్. కొత్త కూటములు కట్టడంలో మీరే సీనియర్. మామను వెన్నుపోటు పొడవడంలో మీరే సీనియర్. ఓడిపోవడంలోనూ మీరే సీనియర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని నీరుగార్చడంలో మీరే సీనియర్. ఈ విషయాల్లో నేను మీతో పోటీ పడలేను’ అని మోదీ విమర్శించారు.