ఈ రోజు ఏపీలోని గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ ఏపీకి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు మోదీకి స్వాగతం పలుకుతూ..నగరంలో కొన్ని చోట్లు హోర్డింగులు, పోస్టర్లు అంటించారు.అయితే ఏపీలో ప్రధాని మోదీ టూర్ ను స్వాగతిస్తున్నట్లుగా వైసీపీ రూపొందించినట్లు గా ఉన్న ఒక పోస్టర్ ను ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకక పోగా మోడీ గారితో తో జోడి కట్టిన జగన్ గారు వైకాపా కార్యకర్తలను మోడీ గారి సభ కి పంపుతున్నారు! అని లోకేష్ ట్విట్టర్ లో ఆరోపించారు.
ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకక పోగా మోడీ గారితో తో జోడి కట్టిన జగన్ గారు వైకాపా కార్యకర్తలను మోడీ గారి సభ కి పంపుతున్నారు! #AndhraDrohiJagan#GoBackModi #ModiIsaMistake pic.twitter.com/IISOaVB50b
— Lokesh Nara (@naralokesh) February 10, 2019
ఈ క్రమంలోనే తాజాగా మోదీ ఫొటోతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫోటో తో ఉన్న పోస్టర్ పై కొడాలి నాని ట్విట్టర్ లో స్పందించారు. పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫోటో, నా ఫోటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు మేం కాదు మోడీ ఐనా చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే “అంటూ ఘాటుగా విమర్శిస్తూ..ట్వీట్ చ చేశారు.
పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫోటో, నా ఫోటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు మేం కాదు మోడీ ఐనా చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే pic.twitter.com/4IFreJEhSB
— Kodali Nani (@IamKodaliNani) February 10, 2019