ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.అయితే సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ముందుగా ప్రకటించిన సమయం కంటే ఆలస్యమైంది. బహిరంగ సభకు వచ్చిన జనాలంతా వేదిక వద్దే గంటలతబడి వేచి చూశారు. తీరా సీఎం మధ్యాహ్నం భోజన సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మహిళలు, పిల్లలు ఆకలితో వెనుదిరిగారు. సీఎం వచ్చే వరకు వేదిక వద్దే ఉన్న జనం అంతా ఆయన వచ్చి ప్రసంగం ప్రారంభించగానే వెళ్లిపోయారు. దీంతో చాలావరకు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. దీంతో స్థానిక నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.దీంతో చంద్రబాబు నెల్లూరు సభ అట్టర్ ఫ్లాప్ అని పలువురు చర్చించుకుంటున్నారు.కాగా చంద్రబాబు మాట్లాడుతూ..2019 లో మొత్తం 30లక్షల ఇళ్లను కట్టి పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. నెల్లూరులో కట్టిన ఇళ్లు అత్యాధునిక వసతులతో ఉన్నాయి. నాక్కూడా ఇక్కడ ఒక ఫ్లాటిస్తే హ్యాపీగా ఇక్కడే ఉంటా.. అని అన్నారు.
సీఎం రాకముందే జనం వెళ్లారు.. – ndn news
సీఎం రాకముందే జనం వెళ్లారు.. ————————————–సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ముందుగా ప్రకటించిన సమయం కంటే ఆలస్యమైంది. బహిరంగ సభకు వచ్చిన జనాలంతా వేదిక వద్దే గంటలతబడి వేచి చూశారు. తీరా సీఎం మధ్యాహ్నం భోజన సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో మహిళలు, పిల్లలు ఆకలితో వెనుదిరిగారు. సీఎం వచ్చే వరకు వేదిక వద్దే ఉన్న జనం అంతా ఆయన వచ్చి ప్రసంగం ప్రారంభించగానే వెళ్లిపోయారు. దీంతో చాలావరకు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ప్రతి కుర్చీలో థ్యాంక్యూ సీఎం అనే ప్లేకార్డులు ఉంచారు. కొంతమంది సీఎం ప్రసంగిస్తున్నంతసేపు వాటిని ప్రదర్శించారు.
Posted by NDN News on Saturday, 9 February 2019