ప్రధాని మోదీ ఇవాళ ఏపీలోని గుంటూరులో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో లక్ష నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీ పర్యటనపై స్పందించారు.ప్రధాని మోదీ ఆంధ్రకు రావడం వెనుకు పెద్ద కుట్ర వుందని బాబు అన్నారు. తనను తిట్టడానికే మోదీ ఢిల్లీ నుంచి పని గట్టుకుని మరీ ఇక్కడకు వచ్చారని అన్నారు.అలా వచ్చారు.. నన్ను తిట్టారు.. పారిపోయారు. వాళ్ల ప్రభుత్వం ఏపీకి ఏం చేశారో చెప్పకుండానే వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను కాపాడిందని మోదీ చెప్పారు. తల్లిని కూడా దగా చేసిన వ్యక్తి మోదీ. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లా. రాష్ట్రానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.