ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీలో చేరాడు. కడప జిల్లాలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాప్తాడు వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. వేపకుంట రాజన్న చేరికతో నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా అందరిని కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం లో వైసీపీ జెండా ఎగురుతుంది అని జగన్ తో అన్నారు
See Also: https://youtu.be/qr7DDwYeheg