ఇవాళ రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలిశారు.ఏపీలో సర్వేల పేరుతో వైసీపీ ఓటర్లను తొలగిస్తున్నారని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఈసీతో చెప్పిన విషయాలను గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు. ప్రజాసాధికారత సర్వేల పేరుతో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను కావాలనే తొలగిస్తున్నారని అన్నారు.అంతేకాకుండా పోలీసు పదోన్నతులను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దాదాపుగా 59 లక్షల బోగస్ ఓట్లు ఎలా ఉన్నాయో.. వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో గవర్నర్ కి వివరించాం అని అన్నారు.కాగా జగన్‌తో పాటు ఆ పార్టీనేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.