దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్ అభిమానులు,జగన్ అభిమానులు , సినీ ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఈ క్రమంలోనే యాత్ర డైరెక్టర్, నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడుతూ… యాత్ర సినిమాకు వచ్చిన హిట్ టాక్ గురించి వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారని, చిత్రంపై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. సినిమా చుసిన తరువాత పబ్లిక్ ఫోన్ చేసి చిత్రంపై ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఈ సందర్భంగా తన ఆనందం వ్యక్తం చేశారు.అయితే ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా యాత్ర సినిమా చూడాలని డైరెక్టర్ మహీ వి రాఘవ కోరినట్లు సమాచారం.