టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. కడప ఎంపీ స్థానానికి ఆదినారయణ రెడ్డి వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మంత్రి షరతుతో మధ్యాహ్నమే రామసుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సీఎంకు అందించారు. జమ్మలమడుగు అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని ఖరారు చేయడంతో మంత్రి ఆది వర్గీయులు అలకబూని వెళ్లిపోయారు అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవకి రాజీనామా చేయాల్సిన అవసరంలేదు.కాని పదవికి రాజీనామా చేశారంటే ఏదో ఒప్పందంలో భాగమై ఉండవచ్చు.
