దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా నిన్న ( శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలో వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే.. కేవీపీ పాత్రలో రావురమేశ్ ఒదిగిపోయారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్ తాజాగా స్పందించారు.
ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..యాత్ర సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన యువ దర్శకుడు మహి రాఘవకు అభినందనలు అని అన్నారు . ఓ మహా నాయకుడు సినిమా.. ఎలాంటి సున్నితమైన అంశాల జోలికి పోకుండా చిత్రాన్ని అద్భుతంగా తీశాడని చెప్పారు.మహానాయకుడి పాత్రలో మమ్ముట్టిగారు ఒదిగిపోయారు. ప్రతి సీన్‌ను ఆయన మోసిన విధానం అద్భుతం. ఈ సినిమాలో కేవీపీ పాత్ర చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెల్లబట్టలేసుకుని ఏదో చేశా అనుకున్నా కానీ.. శుక్రవారం చూసిన తర్వాత నా ప్రాతను చూసి ఆస్వాదించాను. ఈ పాత్ర ఇచ్చినందుకు డైరక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు అని రావు రమేశ్ తన అనుభూతిని తెలియజేశారు.