కర్ణాటకలో బీరు రేటు మరింత పెరగనుండడంతో అక్కడి మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఇక నుండి కర్ణాటక రాష్ట్రంలో బీరుపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. రైతుల సంక్షేమంలో భాగంగా చర్యలు తీసుకునేందుకు బీరు ధరలపై పన్ను పెంచుతున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. బ్రేవరీల్లో తయారు అవుతున్న ఈ బీరుపై ఎక్సైజ్ ట్యాక్స్ ఏకంగా 150 శాతం నుంచి 175 శాతానికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక్కో బీరు బాటిల్ పై ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు పన్నెండున్నర రూపాయలుండగా దీన్ని 25 రూపాయలకు పెంచుతున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. బీరు ధరల పెంపుతో మందుబాబులపై అదనపు భారం పడడంతో వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులు వేసవి కావడంతో బీరు వాడకం భారీగా పెరుగుతుంది కాబట్టి ఖజానాకు లాభం చేకూరనుంది.