తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్‌పై వాట్సాప్ వేటు వేసింది. తాజాగా సీఎం రమేష్ వాట్సప్ ఖాతాను బ్లాక్ చేసింది. సీఎం రమేష్ ఇకనుండి వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని వివరించింది. కొన్నాళ్లుగా సీఎం రమేష్ వాట్సాప్ పనిచేయట్లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ ఆయన వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని ఈ కారణంతో సేవలు నిలిపివేశామని సంస్థ వివరించింది.
వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కాపాడే చర్యల్లో భాగంగా ఎవరు ఫిర్యాదు చేసారో తాము వివరాలు అందజేయలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఈయన వాట్సాప్ బ్యాన్ అవడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందంటూ చేసిన ఆరోపణలపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. అయితే చంద్రబాబు లా ప్రతీది కేంద్రంపై నెట్టివేయడాన్ని సీఎం రమేష్ అలవాటు చేసుకున్నాడని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.