ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబుకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చూపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైయస్ఆర్ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు చక్కగా చూపించారని చెప్పారు.
వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర విశేషాలను ప్రత్యేకంగా చూపించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది తెలుగు ప్రజలంతా తప్పక చూడాల్సిన సినిమాగా పాయకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని.. అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కారం కోసం అనుదినం పనిచేసిన మహానేత వైయస్ఆర్ మార్గంలో తామంతా పనిచేస్తాం అని వైసీపీ నేతలు చెప్తున్నారు. యాత్ర సినిమా చాలా బాగుందని, ప్రజల గుండెలకు హత్తుకునేలా సినిమా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని పలువురు కొనియాడారు.
పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సార్ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చూడదగిన సినిమాగా యాత్రను రూపొందించారని అన్నారు. ఈ సినిమాను కచ్చితంగా చంద్రబాబుకు చూపించి నాయకుడంటే ఎలా ఉండాలో తెలిసేలా చూపించాలని వైఎస్ అభిమానులు కోరుతున్నారు.