దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. ఇప్పటికే యూఎస్‌తో పాటు ఓవర్సీస్‌లో ‘యాత్ర’కు విశేష స్పందన వస్తోంది. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్, ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ప్రోమోలు విడుదలకు ముందే ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో ‘యాత్ర’ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో రిలీజ్‌కి ముందే బాక్సాఫీస్ స్పీడ్ అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది.
ఓవర్‌సీస్‌లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో విడుదల చేయటం ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారు.. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారట. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ ఎలా వ్యవహరించేవారనేది సినిమాలో చక్కగా చూపించారు. ప్రజల తరపున అధిష్టానంతో ఎలా మాట్లాడేవారు.. మాట ఇస్తే ఎవరినైనా ధిక్కరించే నైజాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు.
మొత్తానికి ఈ సినిమాలో హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ చనిపోయే సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.. వైయస్ కుటుంబ అభిమానులకు ఖచ్చితంగా నచ్చే సినిమా అని అర్ధమవుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బేధ, భిన్నాభిప్రాయాలు సినిమాలో కనిపించాయట.. మహి.వి.రాఘవ టేకింగ్ బాగుందనిపిస్తోందట. ఫోటోగ్రఫీ,నిర్మాణ విలువలు, లోకేషన్లు బాగున్నాయట.. మహానాయకుడు, కోట్లాదిమంది ఆరాధ్య దైవం అయిన గొప్ప వ్యక్తి సినిమా కాబట్టి ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వలేకపోతున్నామని తెలియచేస్తున్నాం.