తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రూ.5 ల భోజనం రుచితో పాటు నాణ్యత బాగా ఉండటంతో చాలా మంది నగరవాసులు మధ్యాహ్నం అవగానే భోజన స్టాళ్లను వెతికిమరీ తింటున్నారు. అయితే ఈ రూ.5 భోజనం ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభం అయింది. ఇవాళ సిరిసిల్ల పట్టణంలో పర్యటించిన సందర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కేంద్రం ద్వారా రోజుకు 540 మంది భోజనం లభించనుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు అన్నపూర్ణ భోజన కేంద్రం ప్రారంభించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇక్కడ అన్నార్తులకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం లభిస్తుంది. pic.twitter.com/cr7cPYFQj0
— KTR (@KTRTRS) February 8, 2019
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నపూర్ణ భోజన కేంద్రం ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. స్వయంగా అందరికీ వడ్డించి… అనంతరం స్థానికులతో కలిసి అక్కడే భోజనం చేశారు. అనంతరం కేటీఆర్ నెహ్రునరగ్‌లోని ఇందిరాపార్క్, వైకుంఠదామం, శాంతినగర్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్‌లో ఓ పెన్ జిమ్‌లను ప్రారంభించారు.