మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించారు.ఇవాళ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీదేనని సూచించారు. సర్పంచ్‌గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దనీ సూచించారు.
