Home / 18+ / చంద్రబాబు కాపుల ఓట్లకోసం పవన్ ని వాడుకున్నట్టు ఇప్పుడు క్రైస్తవుల ఓట్లకోసం పాల్ ని వాడుకుంటున్నాడా.?

చంద్రబాబు కాపుల ఓట్లకోసం పవన్ ని వాడుకున్నట్టు ఇప్పుడు క్రైస్తవుల ఓట్లకోసం పాల్ ని వాడుకుంటున్నాడా.?

వైసీపీ అధినేత జగన్ కుల చిచ్చు పెడుతున్నాడని చంద్రబాబు ఆయన అనుకూల మీడియా గగ్గోలు పెట్టింది. కానీ 1983 నుంచీ చంద్రబాబు చేసిన కుల రాజకీయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇప్పుడు 2014లో కూడా కులానికో హామీ, ఉపకులానికి చెందిన నాయకుడికి ఒక కానుక, కులానికి రిజర్వేషన్, కార్పొరేషన్ పేర్లతో కుల చిచ్చులు పెట్టిందే చంద్రబాబు. ఫలితంగా ఏ కులానికెంత ఇస్తున్నారు.? ఏం ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న ప్రశ్నలు మొదలైపోయాయి.

ఏ పార్టీ అయినా ఆ ప్రాధాన్యతా క్రమం చెప్పకుండా ఓట్లు అడగలేని పరిస్థితి దాపురించింది అంటే అందుకు కారణం ఖచ్చితంగా చంద్రబాబే అంటున్నారు సీనియర్ సిటిజన్లు.. 2014 ఎన్నికల్లో బిజేపీ పొత్తుకోసం వెంపర్లాడి మోదీ, పవన్ లతో కలిసి వచ్చాడు చంద్రబాబు. అందుకే అప్పుడు ముస్లిం వర్గాలను పక్కన పెట్టాడు. అలాగే కాపు రిజర్వేషన్ అంశం పెట్టి బీసీలకు, కాపులకు మధ్య వైరం పెట్టాడు. నంద్యాల ఉప ఎన్నిక రాగానే నౌమాన్ ని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా, నాలుగేళ్లుగా మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన ఫరూక్ శాసన మండలి ఛైర్మన్ ఇచ్చాడు. ఇక సాధారణ ఎన్నికలు సమీపంలోకి వచ్చాక ఫరూక్ ను మంత్రిమండల్లోకి తీసుకున్నాడు. ఎమ్మెల్సీ షరీఫ్ కు శాసన మండలి ఛైర్మన్ ఇచ్చాడు.

అంటే ఎన్నికలు వస్తే తప్ప బాబుకు ముస్లింలు గుర్తురారనేది అర్ధమవుతోంది. కాపు ఓట్లను చీల్చేందుకు పవన్ ను వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు చీల్చేందుకు పాల్ ను తెరపైకి తెచ్చారని స్పష్టంగా అర్ధమవుతోంది. డు. ఎస్సీ, ఎస్టీ ఉపకులాల్లోనూ, బీసీలకు, కాపులకు మధ్యన చిచ్చులు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటాడు. కేంద్రం ఇచ్చిన అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకిస్తానని చెబుతూ మరో నాటకంతో కుల సమరం రేపుతున్నాడు. కులాలతో కురుక్షేత్రం చేస్తున్న చంద్రబాబు ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు 2019 ఎన్నికల్లో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat