పెట్టుబడులు పెట్టాలనుకున్న అందరికి తనని చూసే పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పుకు తిరిగే చంద్రబాబు అండ్ పచ్చ మీడియా మొత్తానికి దిమ్మతిరిగిపోయే షాకింగ్ న్యూస్ తగిలింది.రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఏపీలో పెట్టుబడులు పెడతామని ఫారెన్ ఇన్వెస్టర్స్ చెప్పారట.ఈ విషయాన్నిజగనో,సాక్షి పేపరో,లేదా వైసీపీ నేతలో చెప్పలేదు వాళ్ళకి అలాంటి అవసరం కూడా లేదు.దీనిని స్వయంగా తనకే చెప్పారని చంద్రబాబు నోటితో ఆయనే అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.ఎప్పుడూ తన డబ్బాని తానే కొట్టుకొనే బాబు..ఈ సందర్భంలోనే నిజాన్ని చెప్పేశారు.
అసలు విషయానికి వస్తే చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుండి ఇప్పటివరకు ప్రధాని తిరిగినన్ని దేశాలు తిరిగాడు..కాని పెట్టిబడులు మాత్రం ఆశించిన రీతిలో రాలేదు.ఆ దేశాల్లో ఇన్వెస్టర్స్‌ని కలిసినప్పుడు వాళ్ళు అందరు 2019 ఎన్నికల ఫలితాన్ని బట్టే పెట్టుబడులు పెడతాం అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఒక కోణంలో చూస్తే బాబు అధికారంలో ఉండగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే 2014 ఎన్నికల తరువాత పెట్టుబడులు పెట్టి ఉండాలి కదా?అలా కాకుండా 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పెట్టుబడులు పెడతాం అని ఫారెన్ ఇన్వెస్టర్స్ స్వయంగా చెప్పారంటే అర్థమేంటి?అంటే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితేనే పెట్టుబడులు అని డైరెక్ట్‌గా చెప్పేసినట్టే కదా..కాని ఇందులో ఉన్న మర్మం పచ్చ బ్యాచ్ కు అర్ధం కావడం లేదు.20మంది ఎంపీలు ఉన్నా ఇప్పటివరకు ఏపీకి ఏమీ చేసింది లేకపోయినా..అధికారంలో ఉండడంతో ప్రజల సొమ్ముతో విదేశీ పర్యాటనలు చేస్తూ కాలం గడిపేశారు తప్ప ఏపీకి చేసింది ఏమీ లేదు.