ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూల్ జిల్లాలోని రాజకీయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి జిల్లా వ్యాప్తంగా పట్టు సాధించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తుంటే మరోవైపు జిల్లాలో తాను పట్టు వదిలేదిలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇందుకు తగ్గట్లుగానే వైసీపీ అధిష్టానం కూడా సరికొత్త ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడు రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేదు. అయితే ఈ ఎన్నికల్లో వారిని వైసీపీలో చేర్చుకుంటే పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారట. ఈ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీని వీడి ఈనెల 7న వైసీపీలో చేరుతున్నట్లు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనుగడ ఉండదని, కార్యకర్తలను కాపాడుకోడానికి వైసీపీలో చేరుతున్నానని అన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మీద ఉన్న అభిమానంతో వైసీపీలో పని చేయాలని నిర్ణయించుకొన్నానని తెలిపారు. ఈ నెల 7న కోడుమూరులో ఉదయం 6గంటలకు పెద్దాయన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి సుమారు 100 వాహనాలతో కడపకు వెళ్తున్నామని అన్నారు. కడప సమీపంలో గ్లోబల్ ఇంజనీర్ కళాశాల ప్రాంతంలో వైఎస్ జగన్ సమక్షంలో మధ్నాహ్నం 12గంటలకు వైసీపీ కండువ కప్పుకొంటున్నట్లు తెలిపారు.
See Also: