ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదని. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయని, పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేలఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు నిరుద్యోగులకు జాబులు ఇవ్వరు.. 57 నెలలు మోసం చేసి, ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటున్నారు. మన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు నేను ప్రకటించా.. చంద్రబాబు ఇప్పుడు ఖాకీ డ్రస్ వేసుకుని కాపీ కొట్టారన్నారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75వేలు ఇస్తామని మనం చెప్పాం. ఐదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ప్రతీకులానికి కార్పొరేషన్ అంటున్నారు. 2014కు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ చంద్రబాబుకు గుర్తుకు రాదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్లీ బీసీలకు హామీలిస్తున్నారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచేందుకు బాబుకు మనసురాదన్నారు. పాదయాత్రలో అంగన్ వాడీలకు జీతాలు పెంచుతామని చెప్పాను. తాజాగా చంద్రబాబు నిన్ననే ఒక సినిమా తీశారు. చంద్రబాబు తనది కాని బడ్జెట్… ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా చంద్రబాబు బడ్జెట్ పెట్టారు. కాపీ కొట్టడం కూడా ఆయనకు సరిగా రావడం లేదని జగన్ అన్నారు.
