పాదయాత్రకు ముందు వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన నవరత్నాలు ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది.బుధవారం తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం జరిగింది ఈ సభలో ఆయన కీలక ప్రకటన చేశారు.తాము అధికారంలోకి రాగానే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ ఇస్తామని ప్రకటించారు.అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు.కాగా ఇటీవలే చంద్రబాబు వృద్ధాప్య ఫించన్‌ను రూ.1000 నుంచి రూ.2వేలుకు పెంచిన సంగతి తెలిసిందే.
