గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ కార్యకర్తగా తన వంతు చురుకైన పాత్ర పోషించి పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక మంగళగిరి శాఖ అధ్యక్షులు నాయుడు నాగరాజు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేసారు. సమాచార హక్కు కార్యకర్తగా… పత్రికా విలేకరిగా తన వంతు పని చేస్తూ పేదలకు చేస్తున్న సేవకు వచ్చిన గుర్తింపు జనసేన పార్టీ లో తనకు లభించకపోవడం బాధ కలిగిస్తుందని చెప్పారు. జిల్లాలో కోటరీ లు నడుపుతున్న కొందరు అధినాయకుల చుట్టూ తిరిగిన వారికి పదవులు ఇచ్చి పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే నా లాంటి వారికి మొండిచేయి చూపేందుకు జరుగుతున్న కుట్రను తాను ముందుగానే వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
