ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. కృష్ణమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు… ఈ పరిణామంపై స్థానిక టీడీపీ నేత పోతుల సురేశ్ మండిపడ్డారు. కలిసి పనిచేయాలని అధినేత ఎన్నిసార్లు సూచించినా.. ఆమంచి-పోతుల వర్గాలు కలిసి పనిచేసేందుకు ముందుకు రాలేదు. దీంతో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిపోవాడానికి దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్న క్రమంలో జిల్లాలవారికీ పార్టీ పరిస్థితిని అంచనా వేయనున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైతే కొంతమంది నేతలను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలవారీగా జరగనున్న సమర శంఖారావం సభలను ఇందుకు వేదికగా మార్చుకోబోతున్నారు. ఇందులో బాగంగానే ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ను చేరి పార్టీలో చేరిక విషయాన్నిఈ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్ కలవనున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన అనంతరం ఈ నెల 13వ తేదీన ఒంగోలులో జరిగే సమర శంఖారావం సభలో ఆమంచి వైసీపీలో చేరుతున్నట్లు సమచారం.
