ఏపీలో ప్రతిపక్షంలోఉన్న వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు, ఎమ్మెల్యేలు వలస వచ్చేస్తున్నారు. ఇటీవల కడప జిల్లా రాజంపేట నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఆయన అనుచరులు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం నాగమల్లికార్జునరావు వైసీపీలో చేరారు. తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఖలీల్‌బాషా వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి వైయస్ జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజాద్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.
See Also : స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే రాజీనామా..ఈ నెల 13న వైసీపీలోకి