ఎప్పుడూ వివాదాలలో ఉండే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువు కౌశిక్‌రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ జువెలరీ షాపు ముందు కారును పార్క్చేసిన కౌశిక్‌రెడ్డిని ఆ షాపు యజమాని, సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ ఇదేంటి అని ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడ్డాడు.అసల విషయానికి వస్తే ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం 45లోని గుణాస్ డైమండ్స్ జువెల్స్ స్టోర్స్‌వద్దకు వచ్చిన కౌశిక్‌రెడ్డి తన కారును అక్కడే పార్క్‌చేసి పక్కనే ఉన్న పబ్‌కు వెళ్లాడు.
దీనివల్ల స్టోర్స్‌కు వచ్చేవారి కార్లకు ఇబ్బందులు తలెత్తాయి.అయితే కాసేపటికి అక్కడికి వచ్చిన కౌశిక్‌రెడ్డిని షాపు నిర్వాహకుడు సుందర్రాజన్ గుణశేఖర్ అతడిని కారును అడ్డుగా పెట్టి వెళ్తే ఎలా అని ప్రశ్నించాడు.దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కౌశిక్‌రెడ్డి గుణశేఖర్‌పై విరుచుకుపడడమే కాకుండా దాడికి దిగాడు.ఈ ఘటనలో గాయపడ్డ గుణశేఖర్ సోమవారం డిశ్చార్జి అయిన వెంటనే జీవితా రాజశేఖర్ తో బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావును కలిసి ఘటనపై సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోకి వస్తుందన్న ఏసీపీ సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో గుణశేఖర్ ఫిర్యాదు చేశారు.