వివాదాస్పద దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చౌదరి మరోసారి దారుణంగా రెచ్చిపోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. నియోజకవర్గంలోని విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ సాక్షిగా ఈ ఘటన జరిగింది. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావుపై చింతమనేని రెచ్చిపోయారు. నీ కొడుకులు వైఎస్సార్‌సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకులు నిలదీయడంతో చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఫించన్ సొమ్ము ఏమైనా మీ జేబుల్లో నుండి ఇస్తున్నారా.. ప్రభుత్వం సొమ్ము పన్నుల రూపంలో కడుతున్న డబ్బునే కదా ఇస్తున్నారు అంటూ అక్కడివారంతా చింతమనేని పట్ల మండిపడ్డారు.