గత నెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారు వెనుకసీటులో ఉన్నమృతదేహాన్ని కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.అయితే రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు.ఇందులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని అరెస్టు చేశారు.పోలీసుల విచారణ అనంతరం రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు.ఇద్దరు విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్టు వెల్లడించారు.కుక్కలను చంపేందుకు వినియోగించే ఇంజెక్షన్ చేసి జయరాంను హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంజెక్షన్ ప్రభావంతో పది నిమిషాల్లోనే జయరాం శరీరం విషపూరితమైనట్టు తెలుసుకొన్నారు. ఈ హత్యను ఎవరికీ అనుమానం రాకుండా ఒక ప్రమాదంగా చిత్రీకరిచేందుకు రాకేష్ ప్రయత్నించాడని చెప్పుకొచ్చారు.అయితే ఇందులో తన మేనకోడలు శిఖా చౌదరిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జయరాం భార్యాపిల్లలు ఆమెరికా నుంచి భారత్‌కు చేరుకోగా..మృతదేహాన్ని జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. జయరాం ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన భార్య స్టేట్‌మెంట్ తీసుకున్నారు.