తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను జైలులో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్ తప్ప ఎవరూ పరామర్శించలేదన్నారు. ఈవిషయం నన్ను చాలా భాదించిందన్నారు. తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి విభేదాలు లేవని ..సంగారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను కలుస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.అయితే ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లాబీయిస్టులదే హవా నడుస్తోందని, లాబీయిస్టులకే కాంగ్రెస్ పార్టీ పదవులు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
