రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారీ అంచనాలు లేకుండానే బరిలోకి ఉంటామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.ప్రపంచ కప్ కు భారీ అంచనాలు పెట్టుకుని ప్రతీసారి తమకు నిరాశే మిగిలిందన్న విషయాన్ని డుప్లెసిస్ గుర్తు చేసాడు.మేము భారీ అంచనాలు లేకుండానే వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే,రాబోవు ఈ మెగా ఈవెంట్ లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో మరియు టీమిండియా జట్లే ఫేవరెట్స్ అని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.ప‍్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో వరల్డ్‌కప్ ఆడాలనే ఆనందంలో ఉన్నారు. సాధ్యమైనంత వరకూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టాం.
కచ్చితంగా వరల్డ్‌కప్ గెలవాలని మాత్రం ఇంగ్లండ్‌కు వెళ్లడం లేదు అని చెప్పాడు.గెలవాలనే వెళ్తున్నాం అనుకుంటే ఫలితాలు అనుకూలంగా రావడంలేదని వాపోయాడు.చాలా సందర్భాల్లో మేము పేపర్‌పై చాలా పటిష్టమైన జట్టుగానే కనిపించాం.కాని క్రికెట్ అనేది కాగితాల గేమ్ కాదు కాదని ప్రస్తుత మాది బలమైన జట్టు కాదు కాబట్టి అందుచేత భారీ అంచనాలను పెట్టుకోలేదు’ అని డుప్లెసిస్ తెలిపాడు.