తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం ఈడీ అధికారులు హైదరాబాద్ నగరం గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని వారు ఆదేశాలు జారీచేశారు.కాగా గతంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే.