సహజంగా అధికార పార్టీ నుంచి దూరమవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మరీ చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేద్దామని ఎవరూ అనుకోరు. అధికారంలో ఉండి సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతున్న చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి వరకూ ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కట్టారు .తాజాగా అధికార పార్టీకి చేందిన కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఈరోజు వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉదయాన్నే సూమారుగా 500 కార్లలో కడప జిల్లా రాజంపేట టీడీపీ కార్యకర్తలు, మేడా అభిమానులు హైదరాబాద్ నగరానికి వచ్చి చేరిపోయారు. ఈ సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డితోపాటు ఆయన అనుచరులు, నాలుగు మండలాల నాయకులు కూడా పెద్దసంఖ్యలో వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేట నుంచి వచ్చిన మేడా అనుచరులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే నగరంలో వైసీపీ జేండాలతో పోతున్న కార్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక్క నేత చేరికకు ఇంత జనమా అని . కాని వైసీపీ అభిమానులు అయితే అది జగన్ ప్రభజనం అంటున్నారు.
