అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్ట్ చేయడం పై ఒక క్లారిటీ వచ్చింది.మన తెలుగోళ్ళు కొంతమంది అక్కడ పెద్ద ఎత్తున అక్రమ వలస నేరాలకు పాల్పడుతున్నారని సమాచారం.మనకి వచ్చిన సమాచారం ప్రకారం అమెరికాలోని హోమ్ లాండ్ సెక్యూరిటీ అదికారులు ఈ అక్రమ వలసల రాకెట్ ను చేదించి వలసదారుల గుట్టు బయట పెట్టేందుకు మిచిగన్ అనే రాష్ట్రంలో అధికారులు ఫేక్ యూనివర్సిటీని సృష్టించి..అందులో సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అదుపులోకి తీసుకోగా..ఇందులో 200 మంది తెలుగు వారు ఉన్నారు.అంతే కాకుండా ప్రస్తుతం 14మంది తెలుగు విద్యార్థులను డెట్రాయిట్ పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు ఇందులో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని సమాచారం.అయితే సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా ఇక్కడికి వీళ్ళని తీసుకోచ్చినందుకు ఎనిమిది మందిని ఆ దేశ అధికారులు అరెస్ట్ చేసారు.