గులాబీ దళపతి..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపిక చేసిన సంగతి తెలసిందే. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఉత్తమ పార్లమెంటరియన్ గా అవార్డు అందుకోబోతున్న నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలు, టీఆర్ఎస్ ఎన్నారై సలహాదారులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ సౌత్ఆఫ్రికా శాఖ తరపున గుర్రల నాగరాజు టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.