ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్నవైసీపీ పార్టీని ప్రజలు నిలదీయండం ఖాయమని ఏపీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించని వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన ద్రోహంపై ఫిబ్రవరి 1న అసెంబ్లీలో చర్చిస్తామని, ఈరోజున ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ ఉండటం వల్ల.. అదే రోజు చర్చ జరపాలని నిర్ణయించామని అన్నారు.
