2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ,హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పెర్కున్నారు..అయితే హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని చెప్పారు..అందుకే ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ కియా మోటార్స్ ను కేటాయించారు..ప్రధానిని కాదని ఒక సాదారణ నాయకుడి మాట హ్యుందాయ్ లాటి సంస్థ వింటుందా?దీనికి సంబంధించి పచ్చ మీడియా బాబుకు డప్పు కొట్టడం మొదలుపెట్టింది.కాని సౌత్ కొరియా మీడియా ‘ బిజినెస్ కొరియా లో’ 2015 లో మోడీజీ పర్యటన సందర్బంగా వచ్చిన వార్త ఇది.
ఇది అలా ఉండగా..ప్లాంట్ శంఖుస్థాపన జరగగానే ఒక ఎంపీ మరియు రాష్ట్ర మంత్రి తమ కమీషన్ల కోసం డీలర్ షిప్పుల కోసం కంపెనీ ఎండీను ఇబ్బందులు పెట్టడం మొదలెట్టారు.వీళ్ళ బాధ తట్టుకోలేక ప్లాంట్ ఎండీ కంపెనీ చైర్మన్ కు మెయిల్ పెట్టారు.ఇక్కడ ఆంధ్రాలో మనం ప్లాంట్ పెట్టి వ్యాపారం చేయలేము ఇక్కడ అంత అవినీతి,రౌడీ ఇజం రాజ్యమేలుతున్నాయి అని కావున ఇక్కడ మన వ్యాపారం చేయలేమని చెప్పారు.వెంటనే స్పందించిన కంపెనీ చైర్మన్ శ్రీ చుంగ్ మాంగ్ కో ప్లాంట్ పనులు ఆపేసి కంపెనీ హెడ్ క్వార్టర్స్ రమ్మని ఆదేశాలు ఇచ్చారు..అంత జరిగిన తరువాత ఆంద్ర పరిశ్రమల కార్యదర్శి ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడితే మేము ఆంధ్రాలో ప్లాంట్ పెట్టలేం మాకు భద్రతలేదు పైగా అవినీతి వత్తిడితో వ్యాపారం చేయలేము ఇకపై మేము ఏం చెయ్యాలో నేరుగా ప్రధాని కార్యాలయంతో మాట్లాడతాము అని స్పష్టం చేశారు..
ప్లాంట్ పోతే తన పరువు పోతుందని అర్ధమైన చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి హుటాహుటిన అప్పట్లో అకస్మాత్తుగా సౌత్ కొరియా పర్యటన పెట్టుకొని కంపెనీ చైర్మన్ తో ప్రధాని కార్యాలయం ద్వారా అపాయింట్ మెంట్ ఇప్పించుకొని ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి మళ్ళీ ప్లాంట్ పనులు ప్రారంభం చేస్తామని వాళ్ళదగ్గర మాట తీసుకొని భారత్ వచ్చి ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు.. కియా మోటార్స్ విషయంలో ప్రధాని ఇంత సహాయం చేస్తే ఈరోజు దగాకోరు చంద్ర బాబు తన ఎదవబుద్ధి బయటపెట్టాడు..పెద్దలు చెప్పిన మాట నిజమే ‘ పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది. అప్పట్లో దిక్కులేని బాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..ఇప్పడు ఆంధ్రాకు మేలు చేస్తున్న మోడీజీ ను కూడా తన అసత్య ప్రచారంతో కాటేశాడు.