అనిల్ కుమార్ యాదవ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ ఎమ్మెల్యే.. అనిల్ కు నెల్లూరుతో పాటు పార్టీలోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా సర్వేల పేరుతో వచ్చి వివరాలు తీసుకుని ఓట్లు తొలగిస్తుండడం పట్ల వైసీపీ అప్రమత్తమైంది. ఇటువంటివారికి ఎలాంటి వివరాలు ఇవొద్దని అనిల్‌కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారని, ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని అనిల్ మండిపడ్డారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు గల్లంతు అవుతున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు.. ఇందుకు ఎక్కడికక్కడ వైసీపీ యువ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండి పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలందరి కష్టాలు తీరుతాయన్న అనిల్ ఆయనను ముఖ్యమంత్రిని చేసేందుకు రెండు నెలలు రాష్ట్రంలోని యువత అంతా కష్టించి పనియచేయాలన్నారు. చంద్రబాబు మాదిరిగా జగనన్న యువకులను మోసం చేయరని ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగాలతో పాటు బంగారు భవిష్యత్తు ఇస్తారని అనిల్ హామీ ఇచ్చారు. ఈ రెండు నెలలు అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నవారి భరతం పట్టాలని అని సూచించారు.