ఏపీలో జగబోయో ఎన్నికలకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.దీంతో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.ఇప్పటికే అక్కడ అక్కడ అన్ని పార్టీల నేతలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విషయానికి వస్తే 115 మంది సీట్లతో అభ్యర్ధుల తొలి జాబితా రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక విధాలుగా సమీకరణలు సరిచూసుకున్న వైఎస్ జగన్, ఖచ్చితంగా గెలిచే స్థానాలను గుర్తించి అభ్యర్ధులను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు నలభై అయిదు వరకూ ఉన్నారు. వీరితో పాటు మరో 70 మందితో తొలి జాబితా సిధ్ధమవుతోంది అంటున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలుస్తోంది. దాని కంటే ముందే వంద స్థానాల్లో అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలని వైసీపీ అధినేత పట్టుదలగా ఉన్నారని అంటున్నారు .సిట్టింగులకి ఇచ్చేవి .పక్కాగా గెలిచే సీట్లు, పెద్దగా పోటీ లేని సీట్లు కావడంతో వీటిని ప్రకటించినా ఎక్కడా అసంతృప్తి వచ్చే వీలు ఉండదని అంటున్నారు. మిగిలిన 60 సీట్లను మాత్రం ప్రత్యర్ధి టీడీపీ పోటీకి పెట్టే అభ్యర్ధులు, పార్టీలోకి వచ్చే వారిని చూసుకుని విడతల వారీగా సాఫీగా విడుదల చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎది ఏమైన జగన్ 2014 ఎన్నికల్లో మాదిరిగా కాకుండా 2019 లో ఖచ్చితంగా గెలిచే విధంగా చాల చక్కగా అడుగులు వేస్తున్నారు.