రక్షణ శాఖకు చెందిన హైదరాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో పెండింగ్ లో ఉన్న తెలంగాణ కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించుకోవచ్చుని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని కేంద్ర రక్షణ శాఖ భూమి బైసన్ పోలోను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చాలాసార్లు ప్రధాని మోడీని , రక్షణ శాఖ మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే.