డీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్ ఇచ్చారు. టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని సమాచారం. అంతేకాదు ఎన్నోసార్లు ఈ రెండు ఫ్యామీలీలు..ఒకరు మీద ఒకరు పోటి చేసుకున్నారు. మరి ఇప్పుడు కలసి పోటి చేస్తారా..చేస్తే ప్రజలు ఎవ్వరికి ఓటు వేస్తారు అనేది ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి అధికారాలను కత్తిరించి అవమానించిన చంద్రబాబు.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవాలని యోచిస్తున్నారు. మరోవైపు, టీడీపీలోకి కోట్ల రాకపై కేఈ కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై తనకెలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. రాజకీయంగా తొలి నుంచి కోట్ల కుటుంబంతో పోరాడుతున్న కేఈ కృష్ణమూర్తి వర్గం.. చంద్రబాబు తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.
