Home / NATIONAL / మోడీ మ‌స్కా…15 ల‌క్ష‌ల ఉద్యోగాలిచ్చామ‌నే ప్ర‌క‌ట‌న హంబ‌క్‌

మోడీ మ‌స్కా…15 ల‌క్ష‌ల ఉద్యోగాలిచ్చామ‌నే ప్ర‌క‌ట‌న హంబ‌క్‌

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 నెలల్లో 73 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించామంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం వెల్లడించిన లెక్క ఎంత అబద్ధమని, ఇది ప్ర‌జ‌ల‌కు మ‌స్కా కొట్టేందుకే వాస్త‌వాల వ‌క్రీక‌ర‌ణ జరిగింద‌ని గ‌ణంకాలు పరిశీలిస్తే అర్థమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌వో)లో వేతన జీవులను నమోదు చేయడంలో భాగంగా జరిగిన విధాన ప్రక్రియను మోడీ ప్రభుత్వం తెలివిగా తమకు అనుకూలంగా మలచుకుంద‌ని పేర్కొంటున్నారు.

2017 సెప్టెంబర్‌ నుంచి 2018 నవంబర్‌ వరకు ఈపీఎఫ్‌వో ఖాతాలు తెరిచిన ఉద్యోగుల సంఖ్యను కొత్తగా ఉద్యోగాలు పొందినవారిగా బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అయితే, అసలు జరిగిందేమంటే.. లెక్క వాస్తవమే. కానీ, వారంతా కొత్తగా ఉద్యోగాలు పొందినవారు కాదు. ఆ 15 నెలల్లో ఈపీఎఫ్‌వోలో నమోదైన ఉద్యోగుల సంఖ్య 73 లక్షల 50 వేలు. అయితే, వారిలో కొందరు గతంలో ఆయా సంస్థల్లో ఒప్పంద కార్మికులుగా పని చేస్తూ ఆ 15 నెలల కాలంలో వేతన ఉద్యోగులుగా నమోదైనవారు. మరో అంశం కూడా ఇక్కడ గమనార్హం. అదేమంటే ఏదైన సంస్థ ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్‌ కావాలంటటే కనీసం 20మంది ఉద్యోగులను కలిగి ఉండాలి. అంటే.. అంతకుముందు ఆయా సంస్థలు 19మంది ఉద్యోగులనే కలిగి ఉన్నాయనుకుంటే అవి ఈపీఎఫ్‌వోలో నమోదు కావడానికి మరో ఉద్యోగిని చేర్చుకోవాలి. ఆ లెక్కన అంతకుముందు నుంచి పని చేస్తున్నవారు కూడా నూతనంగా ఉద్యోగంలో చేరిన ఓ ఉద్యోగితోపాటు ఒకేసారి ఈపీఎఫ్‌వోలో నమోదవుతారు.

వీటికి తోడుగా, మరో అంశం కూడా ఉన్నది. చాలామంది రెండు, మూడు ఈపీఎఫ్‌వో ఖాతాలు కూడా కలిగి ఉండటం. అదెలా జరుగుతుందంటే.. గతంలో ఓ సంస్థలో పని చేసి ఆ తర్వాత మరో సంస్థలోకి మారినపుడు కొత్తగా మరో ఈపీఎఫ్‌వో ఖాతాను తెరవడం ద్వారా సాధ్య‌మ‌వుతుంది. అంటే….కేంద్రం చెప్తున్న 73 ల‌క్ష‌ల ఉద్యోగాలు పెద్ద మ‌స్కా అని ప‌లువురు చ‌ర్చించుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat