టీఆర్ఎస్ పార్టీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశం ఉంది.గతకొన్ని రోజుల క్రితమే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శారదాపీఠానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .అయితే అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు.ఈ క్రమంలోనే ఆ గృహప్రవేశ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. అది కూడా ఫిబ్రవరి 14నే ఉండడంతో కేసీఆర్ అక్కడికీ వెళ్తారని భావిస్తున్నారు. కేసీఆర్ విశాఖ వెళ్తే అట్నుంచి మంగళగిరి వెళ్లి జగన్‌ను కలిస్తారని, తాను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించే అవకాశముందని సమాచారం.