ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి రాజకీయాలకు తెరలేపారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్,ఆంద్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాదాకృష్ణ గత రాత్రి బేటీ అయ్యారన్న వార్త ఆసక్తికరంగా ఉంది.ఈ వార్త రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది.ఒక పక్క ఆంధ్రజ్యోతికి బాబు 7 వేల కోట్లు దోచి పెట్టాడని బాబు దగ్గర పని చేసిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం చెప్పారు.ఈ రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోలో చేర్చడం లో కీలకపాత్ర పోషించాడు.
మరోపక్క ఇప్పటికే తెలంగాణలో లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే.లగడపాటి చేసిన సర్వేలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేవలం 25 -45 సీట్లు వస్తాయని,మహా కూటమి మాత్రం 55 -75 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుంది అని బల్ల గుద్ది చెప్పాడు.కాని టీఆర్ఎస్ 88 సీట్లు,మహాకుటమి 21సీట్లు వచ్చాయి.సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపు నిలచినా, ఒక్క లగడపాటి సర్వే మాత్రం మహాకూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు విడుదల చేసి,బొక్కబోర్లా పడింది.
రేపు ఏప్రిల్ లో జరగబోయే ఎన్నికలలో ఫ్యాన్ గాలి స్పీడగా వీస్తోంది.ఈ నేపధ్యంలో ఈ ముగ్గురు భేటీ చర్చనీయాంసంగా మారింది.రహస్యంగా జరిగిన ఈ సమావేశం ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.తెలంగాణలో ఎన్నికల్లో ఓటర్లను గందరగోళం చేసేందుకు ప్రయత్నాలు చేసిన లగడపాటి ఇప్పుడు ఏపీలో వైసీపీని ఎలా అడ్డుకోవాలో తెలియక సర్వేల పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించి, వైసీపీని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు,అందుకే దొంగచాటుగా మంతనాలు,దొంగ సర్వేలు, ఉత్తుత్తి కథనాలతో బాబును జాకీలు పెట్టి ఎలా లేపాలి అని చర్చలు జరిగాయని తెలుస్తుంది.ఇక ఏపీలో మరోసారి టీడీపీదే విజయమని త్వరలో లగడపాటి సర్వే ఫలితాలు వస్తాయి.ఈ సర్వేలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నాలుగేళ్ళుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలి.