ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున సర్వేలు జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసాయి.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపించిన లేటెస్ట్ సర్వే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో ” మొత్తం అసెంబ్లీ స్థానాలు 175కు గాను వైసీపీ 122 సీట్లు అధికార టీడీపీ పార్టీకి 49 సీట్లు వస్తాయని అలాగే జనసేన పార్టీకి 4 , బీజేపీకి మరియు కాంగ్రెస్ పార్టీకి ఖాతా తెరిచే పరిస్థితి లేదని...అలాగే ఎంపీ స్థానాల్లో వైసీపీ 21 స్థానాలు గెలిచే అవకాశం ఉందని టీడీపీ 4 స్థానాలను గెలిచే అవకాశం ఉందని అధికార ఇంటలిజెన్స్ సర్వే తేల్చేసింది ” అంటూ ఒక వార్త వైరల్ గా తిరుగుతుంది.
