ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయాలకు ఇదో నిదర్శనం. తాను వ్యవహరించే తీరును మరోమారు ఆయన ప్రస్పుటంగా చాటిచెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్ ఆదివారం కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం వైసీపీలో చేరనున్నామని ప్రకటించారు.
అయితే, ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికో ఆసక్తికర షరతు విధించారు. అదేంటంటే…హితేశ్ అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు.అమెరికా పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే విషయం తెలిసిందే. ముందుగా ఈ సమస్య పరిష్కరించుకోవాలని భేటీ సందర్భంగా జగన్ వారిద్దరికీ సూచించినట్లు తెలుస్తోంది. హితేశ్ అమెరికా పౌరసత్వం రద్దుకు ఆమోదం వచ్చిన తర్వాత దగ్గుబాటి, ఆయన కొడుకు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరుతారని చెప్తున్నా. ఒకవేళ ఎన్నికల వరకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం హితేశ్‌కి టికెట్ ఇవ్వకుండా దగ్గుబాటికి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం,
ఇదిలాఉండగా, వివాదలకు తావు లేకుండా..ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా వైఎస్ జగన్ తీసుకున్న ముందు జాగ్రత్తతో హితేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వివాదం కాకుండా ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా, ఇప్పటికే అమెరికా పౌరసత్వం రద్దుకు హితేశ్ దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం.