తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు బీసీ సభలు పెట్టి వాళ్ళకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ..మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు తెలంగాణ వెళ్లి అక్కడ నేను లేఖ ఇవ్వటం వల్లనే మీ రాష్ట్రం ఏర్పడింది అని మాట్లాడి,ఏపీలో మాత్రం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారంటున్నాడు.ఓట్ల కోసం అక్కడొక్కటి,ఇక్కడొక్కటి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.ఇవన్నీ చూస్తుంటే తన జీవితంలో ప్రాంతీయ పార్టీ( తెలుగుదేశం) పెట్టి పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
