కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. తాజాగా తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తండ్ర మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు. అనంతరం ఆయన ఫిబ్రవరి 6వతేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
కాగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన సతీమణి సుజాతమ్మ కుమారుడు రాఘవేందర్ రెడ్డి మాత్రం వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఒక విధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి నిజంగా ఇది టిడిపికి పెద్ద షాకే జిల్లాలో బాగా పేరున్న కోట్ల కుటుంబం వైసీపీలో చేరితే కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా జిల్లాలో శిధిలావస్థకు చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకాలం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజకీయంగా కుంటుంబం స్తబ్దుగా ఉన్నా స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా మళ్ళీ క్రియాశీలకమయ్యారు. వైసీపీ అభ్యర్ధి గౌరు వెంకట్ రెడ్డికి కూడా మద్దతు ప్రకటించారు.
జిల్లాలో టిడిపి అక్రమాలు పెరిగిపోయాయని, అడ్డుకోకపోతే కష్టమనిదాంతో తాము వైసీపీలో చేరుతున్నామనేది కోట్ల కుటుంబం చెప్తున్న మాట. జిల్లా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు కొడుకు రాఘవేంద్రరెడ్డి, భార్య సుజాతమ్మ త్వరలో వైసీపీలో చేరనున్నారు. సుజాతమ్మ ఎమ్మెల్యేగా, కొడుకు ఎంపీగా పోటీ చేయాలని సూర్యప్రకాశ్ రెడ్డి మాత్రం ప్రత్యక్ష యాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.. కోట్ల నిర్ణయంతో టిడిపికి పెద్ద షాకే తగలవచ్చు. కారణం జిల్లాలోని కర్నూలు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కోట్ల కుటుంబానికి పట్టుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల్లోని బలమైన బలమైన వర్గాలను మెల్లిగా పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా ఎన్నికల నాటికి వైసీపీ ప్రభంజనం చాపక్రిందనీరులా పారుతోంది. కడప తర్వాత కర్నూలు జిల్లా వైసీపీకి బలంగా మారింది.