వైఎస్సార్ జిల్లా మైదుకూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఏపీలో హల్ చల్ చేస్తుంది. తన అనుచరులను అదుపులోకి తీసుకుని, కొట్టారంటూ కొంతమందితో కలసి మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డిని సీఐ జీఆర్ యాదవ్ అడ్డుకున్నారు. దీంతో, వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బయటకు వెళ్లాలంటూ సీఐ, పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో, ‘మమ్మల్నే బయటకు వెళ్లమంటావా… షూట్ చేస్తానంటావా… ఎంతమందిని షూట్ చేస్తావు’ అంటూ తన అనుచరులతో కలసి స్టేషన్ బయట బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, తిరిగి తన న్యాయవాదితో కలసి సీఐ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏమీటంటే.. టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబసభ్యులపై వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేశారని మైదుకూరు పీఎస్ లో వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 30, 40 మందిని పీఎస్ కు తీసుకొచ్చి విచారిస్తండగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీస్ సేఫ్టన్ కు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు సమచారం.
