ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాలను, అవినీతి విధానాలను…అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసును వివిధ పార్టీలకు చెందిన నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారనేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే తరహా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.
తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల పనితీరును…అవార్డుల విధానాలను విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లలో వివరించారు. “తెలంగాణా ప్రభుత్వం అర్హత ఆధారంగా గేయ రచయిత సిరివెన్నెల, అంతర్జాతీయ ఫుట్ బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రిలకు పద్మశ్రీ ఇవ్వాలని కోరింది. ఇక్కడేమో మీ సామాజిక వర్గానికి చెందిన ద్రోణవల్లి హారిక, యడ్లపల్లి వెంకటేశ్వర్రావును రెకమండ్ చేసారు. వీళ్లు తప్ప ప్రతిభావంతులు కనిపించలేదా చంద్రం సారూ?“ అంటూ నిలదీశారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టుల తీరును ఆయన ప్రశ్నించారు. “కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణా 90% పూర్తి చేసింది. 2014 కంటే ముందే పోలవరానికి అన్ని అనుమతులు వచ్చి పనులు మొదలైనా సాగదీస్తున్నారెందుకు చంద్రబాబు గారు? మీ దోపిడీకి పాడి ఆవులా మార్చుకున్నారే కాని ఆయకట్టుకు నీరివ్వాలనే ఆలోచన చేశారా?“ అని నిలదీశారు. చంద్రబాబు గారు ఒక నకిలీ డాక్టరు లాంటి వ్యక్తి. రోగం మూలాలను గుర్తించి వైద్యం చేయడం ఆయనకు తెలియదు. నొప్పు నివారణ మందులు, పై పూతలకు ఆయింట్ మెంట్లు ఇచ్చి వ్యాధి తగ్గిపోతుందని మభ్య పెడతాడు. కొద్ది రోజులు ఉపశమనం అనిపించినా జబ్బు ముదిరి రోగి మంచాన పడతాడు.“ అంటూ మండిపడ్డారు.