న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హర్ధిక్ పాండ్యా అప్పుడే తన పవర్ ఏంటో చూపించాడు. చహల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ముందుకొచ్చి షాట్ ఆడగా.. ఫార్వార్డ్ ఫీల్డింగ్ ఉన్న పాండ్యా సూపర్ డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. రెప్పపాటులోనే పాండ్యా సూపర్ క్యాచ్ అందుకోవడంతో విలియమ్సన్(28) నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్‌కు పెద్ద దెబ్బపడింది. మెుదట్లోనే రెండు వికెట్లు పోయి కష్టాల్లో పడ్డ కివీస్ ఇన్నింగ్స్‌ను విలియమ్సన్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో పాండ్యా స్టన్నింగ్ క్యాచ్‌తో విలియమ్సన్(28) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
#teamindia #HardikPandya
Awesome catch … pic.twitter.com/41Ap3cQLJP— shankar more (@We_Indians_) January 28, 2019